బచ్చ్చల మల్లి ట్రైలర్ రిలీజ్..! 8 d ago
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, అమ్రితా అయ్యర్ జంటగా నటించిన బచ్చ్చల మల్లి చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది. నాచురల్ స్టార్ నాని తన చేతుల మీదగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో నరేష్ యాక్టింగ్, డైలాగ్స్, మ్యూజిక్ మూవీ పై అంచనాలు పెంచాయి. ఈ చిత్రాన్ని సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ పతాకం పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.